ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

KDP: ఎర్రగుంట్లలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థర్మల్ నుంచి కలమల్లకు వెళ్తున్న టిప్పర్, బైకును ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముద్దనూరు మండలం కొసినేపల్లికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. ప్రొద్దుటూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.