ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని విద్యార్థిని ఆత్మహత్య
KMR: పట్టణంలోని వాంబే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని ఇంట్లోని బాత్ రూంలో ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న బాలికను GGHకు తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేసినా, ఫలితం దక్కలేదు. స్థానికుల కథనం ప్రకారం.. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిందని, విభేదాల వల్ల ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపారు.