బడి పిల్లల నమోదు పెంపుకు కరపత్రం ఆవిష్కరణ

బడి పిల్లల నమోదు పెంపుకు కరపత్రం ఆవిష్కరణ

తిరుపతి జిల్లాలో బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సూచించారు. విద్యార్థుల నమోదు పెంపు కోసం 'మన సంకల్పం – విద్యా ప్రగతి' ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించి, అర్హులైన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు.