VIDEO: సమావేశంలో గందరగోళం.. జీతాలు పెంచాలంటూ డిమాండ్
NLR: కోవూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ విజయమ్మ అధ్యక్షతన వార్డ్ నెంబర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచాలంటూ వైసీపీకి చెందిన వార్డ్ మెంబర్లు సభ దృష్టికి తీసుకొని వచ్చారు. బడ్జెట్ లోటు ఉందని జీతాలు పెంచడానికి అవకాశం లేదని చెప్పడంతో గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచేందుకు తీర్మానం చేశారు.