బంటనహాళ్ గ్రామంలో డ్రైనేజ్‌కు అడ్డంకులు

బంటనహాళ్ గ్రామంలో డ్రైనేజ్‌కు అడ్డంకులు

KRNL: బంటనహాళ్ గ్రామంలో డ్రైనేజ్ నీటి ప్రవాహానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన డ్రైనేజ్ మార్గం మూసుకుపోవడంతో నీరు నిల్వ ఉండి దుర్వాసన, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకుని నీరు సజావుగా వెళ్లేలా చేయాలని పంచాయతీ సెక్రటరీని గ్రామస్తులు కోరారు