అథ్లెటిక్స్‌లో అపర్ణ విజయకేతనం
NLR: కావలి జవహర్ భారతి విద్యార్థిని వాయల అపర్ణ విక్రమ సింహపురి వర్సిటీ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు. 400, 800, 1500మీ పరుగు, లాంగ్‌జంప్‌లో విజేతగా, ట్రిపుల్ జంప్‌లో రన్నరప్‌గా నిలిచి సత్తాచాటారు. వరుసగా రెండోసారి ఛాంపియన్ అయిన అపర్ణ, స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని తెలిపారు.