నేడు కల్ప వృక్ష వాహన సేవ

CTR: కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి కల్పవృక్ష వాహనంపై వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ వాహన సేవకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని అధికారులు కోరుతున్నారు.