ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

CTR: నగరంలో తేనె బండ ధర్మరాజుల గుడి వద్ద ఉంటున్న రవి కుమార్ (39) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య తెలిపారు. మానసిక ఒత్తిడితో జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. కొంతకాలంగా ఆయన తాగుడుకు బానిసైనట్లు పేర్కొన్నారు. అతడి భార్య హరిణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.