నేడు అన్నపురెడ్డిపల్లి మండలంలో పవర్ కట్
BDK: అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ తరుణ్ తెలిపారు. 11 కేవీ పెంట్లం ఫీడర్ లైన్ మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంట్లం, కంపగూడెం, భాస్కరపురం గ్రామాలకు సరఫరా నిలిపివేస్తున్నట్లు అన్నారు. విద్యుత్తు లైన్ల నిర్వహణ పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని కోరారు.