ఈనెల 30న విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం
CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఈనెల 30న నిర్వహించడం జరుగుతుందని MRO రాము సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.