అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన
JGL: రాయికల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుజాత మాట్లాడుతూ.. చిన్నారులకు బాలామృతం తినిపించాలని, చిరుధాన్యాలతో జావా మెత్తగా వండి పిల్లలకు తినిపించాలని సూచించారు. హెచ్ఎం మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, కారోబార్ జలంధర్, ఆయా లక్ష్మి, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.