BREAKING: భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయని.. త్వరలో మావోయిస్టుల వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.