కమిషనరేట్ పీజీఆర్ఎస్‌కు 82 ఫిర్యాదులు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో మొత్తం 82 ఫిర్యాదులు స్వీకరించారు. డీసీపీ ఎస్‌వీడీ. ప్రసాద్, ఏడీసీపీ శ్రీ ఎం. రాజారావు బాధితుల సమస్యలను నేరుగా విన్నారు. భూవివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలు, మహిళా సమస్యలపై ఈ ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.