శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు భూమి పూజ

KDP: రైల్వే కోడూరు పట్టణంలోని పాతబజార్ ప్రాంతంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంకు శుభారంభంగా గురువారం భూమి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు.