ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం

GNTR: తుళ్లూరు గ్రంథాలయంలో సోమవారం వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభమైంది. లైబ్రేరియన్ టి.గిరిధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవిలో ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు గ్రంథాలయాల్లో ఇండోర్ గేమ్స్, పుస్తక పఠనం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.