సామెత - దాని అర్థం
సామెత: 'అడగందే అమ్మయినా అన్నం పెట్టదు'
అర్థం: ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేది అమ్మ. కానీ, అమ్మ అయినా కొన్ని సందర్భాల్లో ఆకలి తీర్చడం మర్చిపోవచ్చు. మొహమాటంతో అమ్మ పెడుతుందిలే అని ఊరుకుంటే ఆకలి తీరదు. అమ్మ దగ్గర మొహమాట పడేవాళ్లు ఎవరి దగ్గరా చొరవగా ఉండలేరు. చొరవ తీసుకుని అడగకపోతే ఏ పని జరగదు. అన్నిటికీ మొహమాట పడేవారిని చూసి చెప్పే సామెత ఇది.