శుభవార్త చెప్పిన చీరాల MLA

శుభవార్త చెప్పిన చీరాల MLA

బాపట్ల: చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో 50పడకల క్రిటికల్ కేర్ వైద్యసేవ గదులను త్వరలో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా వైద్య విభాగంలో ఉండే పలు సేవలు ఈ క్రిటికల్ కేర్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని 14 ఎకరాల్లో రూ.23.27 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.