రైస్ కార్డులకు సంబంధించి మరో 6 సేవలు: కలెక్టర్

KKD: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో నూతన రైస్ కార్డుల నమోదుతో పాటు రైస్ కార్డులకు సంబంధించి మరో 6 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుధవారం నుండి ప్రారంభించినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను సచివాలయాలలో ఏపి సేవా ప్లాట్ ఫారమ్ ద్వారా నమోదు చేసేందుకు సిబ్బందిని సంసిద్ధం చేశామన్నారు.