12,300 లీటర్ల బెల్లపు ఊటలు ధ్వంసం

SKLM: పలాస, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల యొక్క ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో బుధవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావు, ఒడిశా అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు.12300లీ.బెల్లపు ఊటలు, 1330 లీ నాటుసారా ధ్వంసం చేసినట్లు పాతపట్నం ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు.