మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ప్రారంభం

ప్రకాశం: కొమరోలు పట్టణంలో పేద మహిళల కొరకు సురభి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని డాక్టర్ దివాన్ భాషా సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాన్ భాష మాట్లాడుతూ.. పేద మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ నేర్పించి వారికి జీవనోపాధి కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.