ఇంటర్‌నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్‌లో జిల్లా విద్యార్థి ప్రతిభ

ఇంటర్‌నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్‌లో జిల్లా విద్యార్థి ప్రతిభ

ATP: ప్రపంచ చదరంగ సమాఖ్య తాజాగా విడుదల చేసిన జాబితాలో అనంతపురంలోని తపోవనానికి చెందిన 7 ఏళ్ల నిహాల్ నయనంజన్ ఇంటర్‌నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ 1505ను సాధించాడు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. నిహాల్ అతి చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి రేటింగ్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మంగళవారం నిహాల్‌ను కోచ్, తోటి క్రీడాకారులు అభినందించారు.