అర్జీలు స్వీకరించిన మంత్రి

అన్నమయ్య: సంబేపల్లి మండలం నారాయణరెడ్డి గారి పల్లెలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం రూ. 9 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. గ్రామ ప్రజలు మంత్రికి పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. బాధితుల అర్జీలను స్వీకరించిన మంత్రి అప్పటికప్పుడే సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించారు.