VIDEO: పడకేసిన పారిశుద్ధ్యం.. రోడ్లపైనే మురుగునీరు!
SRPT: అనంతగిరి మండలం పాలవరంలో డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్లపైనే నిలుస్తోంది. అనంతగిరి-చనుపల్లి రహదారి విస్తరణలో భాగంగా పాత డ్రైనేజీని తొలగించిన అధికారులు, కొత్తది నిర్మిస్తామని హామీ ఇచ్చి నెలలు గడిచినా నిర్మించలేదు. దీంతో నిలిచిన మురుగునీరు దుర్వాసన వెదజల్లుతూ, దోమలకు నిలయంగా మారింది. వెంటనే అధికారులు డ్రైనేజీని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.