జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

మెదక్  జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.