పత్తికొండలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

KRNL: పత్తికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను పంచాయతీ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే శ్యాంబాబు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కొమ్ము దీపిక, ఈఓఆర్డి నరసింహులు పంచాయతీ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. హ్యాపీ బర్త్ డే సీఎం సార్, తెలుగుదేశం జిందాబాద్, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు ఇచ్చారు.