వనరుల కేంద్రాలకు నిధుల మంజూరు

వనరుల కేంద్రాలకు నిధుల మంజూరు

PPM: మన్యం జిల్లాలో 14 మండల వనరుల కేంద్రాల నూతన భవన నిర్మాణాలకు రూ. 7.42 కోట్లు మంజూరయ్యాయని సమగ్రశిక్షా ఏఈ వి. రామకృష్ణ తెలిపారు. సీతంపేట, భామిని, వీరఘట్టం కేజీబీవీలకు డార్మిటరీల నిర్మాణానికి రూ. 2.16 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తైందని, గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు.