VIDEO: కోయగూడెంలో ట్యాంకర్‌తో తాగునీటి సరఫరా
MULG: ఏటూరునాగారం మండలం కొమురం భీమ్ కోయగూడెం గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడింది దీంతో సోమవారం తాగునీటి సమస్యపై సర్పంచ్ విజయ్ కుమార్ స్పందించి ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేపట్టారు. దీంతో గ్రామస్థులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే శాశ్వత పరిష్కారం కోసం బోర్వెల్స్, ఓవర్హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.