VIDEO: 'తుపాకులు పోలీసు, సైనికుల చేతుల్లోనే ఉండాలి'

VIDEO: 'తుపాకులు పోలీసు, సైనికుల చేతుల్లోనే ఉండాలి'

KNR: దేశాన్ని రక్షించే సైనికులు, చట్టాన్ని కాపాడే పోలీసుల చేతుల్లోనే తుపాకులు ఉండాలని, ఇతర వ్యక్తుల చేతుల్లో తుపాకులుంటే సమాజానికి విధ్వంసం తప్పదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం, నిషేధం అమల్లో ఉన్న నక్సలిజాన్ని ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.