పరిశుభ్రత తోనే ఆరోగ్యం

పరిశుభ్రత తోనే ఆరోగ్యం

అనకాపల్లిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రింగ్ రోడ్ నుంచి బెల్లం మార్కెట్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు.