దీపారాధనపై రగడ.. రంగంలోకి ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఇవాళ తమిళనాడులోని మధురైలోని అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపరంకుండ్రం కొండపై దీపారాధన విషయంలో మద్రాస్ హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కోర్టు తీర్పు ఇచ్చిన జస్టిస్ స్వామినాథన్‌పై INDI కూటమి ఎంపీలు అభిశంసన కోరగా, భక్తుల పక్షాన బీజేపీ నిలిచింది.