'వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి'

BHPL: రేగొండ మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవ రెడ్డి బుధవారం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి గల రైతులు సెప్టెంబర్ 6లోగా అవసరమైన పత్రాలతో క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులు సమర్పించాలన్నారు.