'జుత్తు ఆశయాలు ఆచరణీయమైనవి'

'జుత్తు ఆశయాలు ఆచరణీయమైనవి'

SKLM: మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జుత్తు జగన్నాయకులు ఆశయాలు ఆచరణీయమైనవని స్థానికులు కొనియాడారు. మందస మండలం బేతాళపురం గ్రామంలో మంగళవారం జుత్తు జగన్నాయకులు 8వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవిని నిస్వార్ధంగా వాడుకొని ప్రజల గుండెల్లో నిలిచారని తెలిపారు.