'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

SKLM: ఆమదాలవలస మండలం జొన్నవలస సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో రామ్మోహన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి, సక్రమంగా రికార్డులను నిర్వహించాలని సూచించారు.