అక్రమంగా నిల్వ ఉంచిన 28 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ  ఉంచిన  28 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని ఉప్పర కాలనీలో శనివారం పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన 28 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో రేకుల షెడ్‌‌లో ఈ బియ్యం బస్తాలను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.