సింగూరుకు పోటెత్తిన వరద.. 5 గేట్లు ఓపెన్

SRD: సింగూరు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 29,314 క్యూసెక్కుల ఇన్ ఫ్లో అవగా అధికారులు ఐదు గేట్లను పైకెత్తి 40,943 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గత 3రోజుల క్రితం 8, 9, 10 నంబర్ల గేట్ల ద్వారా దిగువకు నీటిని వదలగా, సోమవారం రాత్రి 10 గంటల సమయంలో 4, 5 నంబర్ల గేట్లను ఎత్తివేశారు.