'గృహిణి సంతోషంగా ఉంటేనే కుటుంబమంతా ఆనందం'
TG: మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కోటిమంది మహిళలను స్వయంసహాయ సంఘాల్లో చేర్చాలని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. గృహిణి సంతోషంగా ఉంటేనే కుటుంబమంతా ఆనందంగా ఉంటుందని తెలిపారు. మహిళలు వ్యాపారాల్లో రాణించాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని పేర్కొన్నారు.