VIDEO: 'ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని అమలు చేయాలి'

VIDEO: 'ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని అమలు చేయాలి'

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలువురు మాజీ మావోయిస్టులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం వినతి పత్రం అందజేశారు. 2019లో పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు గంగుబాయి మాట్లాడుతూ.. ప్రభుత్వం రివార్డుతో పాటు ఇంటి స్థలం సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు కోరారు.