చిన్నఅడిశర్లపల్లిలో సర్పంచ్ పదవి వేలం
NLG: జిల్లాలోని గ్రామాలలో గ్రామపంచాయతి ఎన్నికల్లో ఏకగ్రీవాలు, వేలంపాటలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నఅడిశర్లపల్లిలో సర్సంచ్ పదవిని గ్రామ పెద్దలు వేలం వేశారు. ఈ వేలంలో రూ. 51 లక్షా 30 వేలకు సర్పంచ్ పదవిని వెంకటయ్య దక్కించుకున్నారు. ఈ నెల 7వ తేదీన వేలం డబ్బులు చెల్లించేలా గ్రామస్థులు ఒప్పందం చేసుకున్నారు.