రాప్తాడులో రోడ్డు పనుల పరిశీలించిన ఎమ్మెల్యే
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ఆత్మకూరు మండలం రంగంపేట నుంచి తగరకుంట వరకు జరుగుతున్న 13.5 కిలోమీటర్ల రోడ్డు పనులను పరిశీలించారు. రూ.6.40 కోట్లతో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తూముచర్లలో వర్మీ కంపోస్ట్ యూనిట్‌ను పరిశీలించి, పంచాయతీ ఆదాయం పెంచే చర్యలు సూచించారు. అనంతరం తగరకుంటలో 24 గంటల విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రారంభించారు.