'ఇంజినీరింగ్ అట్లాస్ రూపకల్పన వేగవంతం చేయాలి'
ASR: జిల్లాలోని రహదారుల అనుసంధానతకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారంతో 'ఇంజనీరింగ్ అట్లాస్'ను రూపొందించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేయాలని జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. రహదారులన్నింటికీ నిర్దిష్టమైన రోడ్డు నంబర్లను కేటాయించి, వాటిని అట్లాస్లో పొందుపరచాలన్నారు