'ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి'
అన్నమయ్య: జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో, నాణ్యతతో పరిష్కరించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.