జిల్లా ఆసుపత్రికి మంత్రి అచ్చన్న ఆకస్మిక పర్యటన

జిల్లా ఆసుపత్రికి మంత్రి అచ్చన్న ఆకస్మిక పర్యటన

SKLM: టెక్కలిలో జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మొత్తం ప్రాంగణంతో పాటు పలు వార్డులను ఆయన పరిశీలించారు. నేరుగా రోగుల వద్దకే వెళ్లి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వచ్చే రోగులకు ఎటువంటి ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.