చిరుత పులి కలకలం.. లేగదూడ మృతి
GDWL: ధరూర్ మండలంలోని నీతోని పల్లి, ఉలిగేపల్లి గ్రామాల మధ్య బుధవారం రాత్రి చిరుత పులి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. గత కొద్ది రోజులుగా మండలంలో వరుసగా మూగజీవాలు మృత్యువాత పడుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా చిరుత దాడిలో ఒక లేగదూడ మరణించిందని గ్రామస్థులు పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు.