'ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి'

SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా మౌలిక వసతులు ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని జిల్లా డిప్యూటీ డీఈవో విజయకుమారి తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం బొరిగివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు త్రాగునీటి సదుపాయం తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.