VIDEO: మౌలిక సదుపాయాలు కల్పించాలని నిరసన
కృష్ణా: గుడివాడ లింగవరం గ్రామం బ్రహ్మారెడ్డి కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు శుక్రవారం నిరసన తెలిపారు. మంచినీటి సమస్య గురించి పది రోజుల నుంచి అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బుడదలో తాము నడవలేక పోతున్నామని, వెంటనే రోడ్లు నిర్మించి, కచ్చా డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.