శ్రీధర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

శ్రీధర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

NDL: వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామానికి చెందిన భాష్యం శ్రీధర్ గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం వారి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే.. మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ నుంచి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.