సింహాచలంలో పింఛన్ పంపిణీ

సింహాచలంలో పింఛన్ పంపిణీ

VSP: సింహాచలం గాంధీ నగర్లో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకి పింఛన్‌ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల 65 లక్షల మందికి రూ.2,900 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తమకు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఎంతో ఉపయోగపడుతుందని వృద్ధులు తెలిపారు.