విద్యార్థులకు పతకాల అందజేత
ప్రకాశం: జనగణన ప్రాముఖ్యతను తెలియజేసేలా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గురువారం విద్యార్థులకు క్విజ్, ఎస్సే రైటింగ్ నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ప్రతిభచూపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో రాణించిన విద్యార్థులకు ఎంఈవో అబ్దుల్ సత్తార్ చేతుల మీదుగా పతకాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.