'ప్రొద్దుటూరు పోలీసులపై సీఎంకు ఫిర్యాదు చేస్తా'
KDP: ప్రొద్దుటూరు పోలీసుల తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని వారిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారి శ్రీనివాసులు కిడ్నాప్ వ్యవహారంపై న్యాయ విచారణ కోరతామని పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా పోలీసుల వ్యవహారాలున్నాయని ఆయన ఆరోపించారు.