నార్నూరులో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నార్నూరులో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ADB: నార్నూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భిక్కు రాథోడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాల పునాదిపై బీజేపీ నిర్మితమై ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో ప్రకాష్, రాజాబాబు, హనుమంతు ఉన్నారు.